అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

Published Wed, Nov 15 2023 1:04 AM

- - Sakshi

కాంగ్రెస్‌ రూరల్‌ అభ్యర్థి భూపతిరెడ్డి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మోసం చేసిందని, కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తుందని నిజామాబాద్‌ రూరల్‌ పార్టీ అభ్యర్థి భూపతిరెడ్డి అన్నారు. మోపాల్‌, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లోని ఆయా గ్రామాల గంగపుత్ర సంఘ సభ్యులు దాదాపు 500మంది మంగళవారం భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా ఆయనకు చేపలు, వలను గంగపుత్రులు బహుకరించారు. అనంతరం భూపతిరెడ్డి మాట్లాడుతూ.. రూరల్‌ నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందని, కాంగ్రెస్‌కు భారీ విజయం తథ్యమన్నారు. గంగపుత్ర అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, కస్పా శ్రీనివాస్‌, బాలయ్య, గోపి, నారాయణస్వామి, మోహన్‌ పాల్గొన్నారు.

పలుగ్రామాల్లో ఎన్నికల ప్రచారం..

ఇందల్వాయి: మండలంలోని మల్లాపూర్‌, లోలం, ఎల్లారెడ్డిపల్లె, అన్సాన్‌పల్లి, గౌరారం, తిర్మన్‌పల్లి తదితర గ్రామాల్లో భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌రెడ్డితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డొంకల్‌లో భూపతిరెడ్డికి మద్దతుగా ప్రొఫెసర్‌ కోదండరాం ప్రచారం నిర్వహించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement