కాలనీలో కత్తిపోట్ల కలకలం.. | - | Sakshi
Sakshi News home page

కాలనీలో కత్తిపోట్ల కలకలం..

Aug 5 2023 1:22 AM | Updated on Aug 5 2023 8:35 AM

- - Sakshi

నిజామాబాద్‌: నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చంద్రశేఖర్‌ కాలనీలో కత్తిపోట్ల కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మధ్య జ రిగిన గొడవలో ఆవేశం పట్టలేక ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి చేయగా వారు చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం రూరల్‌ ఎస్సై జి మహేశ్‌ తెలిపిన వివరాలు.. చంద్రశేఖర్‌ కాలనీ గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ విందులో ఎస్‌కే హుస్సేన్‌, ఎస్‌కే అక్బర్‌, అబ్దుల్‌, సద్దాం పాల్గొన్నారు. వీరిమధ్య మాటమాట పెరిగటంతో గొడవ జరిగింది. ఇంతలో సద్దాం తన స్నేహితుడు అమీర్‌ఖాన్‌కు ఫోన్‌చేసి తనను కొడుతున్నారని చెప్పాడు. దీంతో ఆయన స్నేహితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు.

ఇందులో ఎస్‌కే నవీద్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లి ఏమైందని ఎందుకని కొడుతున్నారని అడుగగా కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో హుస్సేన్‌, అక్బర్‌, అమీర్‌ఖాన్‌కు గాయలు కాగా, ఎస్‌కే నవీద్‌ను సద్దాం కత్తితో పొడిచాడు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్‌ బావ షేక్‌ మోబిన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కత్తితో దాడి చేసిన సద్దాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement