జీరో పాయింట్‌కు పునరుజ్జీవం నీరు | - | Sakshi
Sakshi News home page

జీరో పాయింట్‌కు పునరుజ్జీవం నీరు

Aug 4 2026 2:17 AM | Updated on Aug 4 2026 2:17 AM

వేల్పూర్‌(మెండోరా): వరద కాలువ ద్వారా పునరుజ్జీవం నీరు ముప్కాల్‌ వద్ద ఎస్సారెస్పీ జీరో పాయింట్‌కు సోమవారం ఉదయం చేరుకుంది. రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్‌ నుంచి ముప్కాల్‌ వరకు రివర్స్‌ పంపింగ్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభించారు. ఒక పంపు ద్వారా 1450 క్యూసెక్కుల నీటిని వరద కాలువకు వదిలారు. 4.5 మీటర్ల వాటర్‌ లెవల్‌ వచ్చేలా నీటిని విడుదల చేశారు. 0.5 టీఎంసీల నీరు వరద కాలువలో నిల్వ ఉంచినట్లు డీఈ గణేశ్‌ తెలిపారు. వరద కాలువపై ఆధారపడ్డ రైతులతోపాటు కాలువ చుట్టుపక్కల సుమారు 2 కిలోమీటర్ల వరకు బో రుబావుల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

4.5 మీటర్ల ఎత్తు వరకు నిల్వ ఉన్న నీరు

ఎస్సారెస్పీ జీరో పాయింట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement