● అదనపు కలెక్టర్ భుజంగరావు
● కలెక్టరేట్‌లో 121 వినతుల స్వీకరణ
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు ట్రెయినీ కలెక్టర్ సురే
ష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 121 ఫిర్యాదులు రాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే దాడులు..
రెంజల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం పలువురు అనుమతులు తీసుకుని అక్రమంగా ఇసుకను నిల్వ చేసుకున్నట్లు రెంజల్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి చెందిన పలువురు వార్డు సభ్యులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వారు వెంటనే గ్రామానికి చేరుకుని సుమారు 35 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు.


