రెంజల్: మండల కేంద్రంలో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన డిఫెన్స్ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేశ్ తెలిపారు. పరిమితికి మించి డిఫెన్స్ మద్యం బాటిళ్లు కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం రెంజల్‌లోని రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశామన్నారు. అతడి ఇంట్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన డిఫెన్స్ బాటిళ్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన 14 పుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రాకేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
పిట్లంలో రేషన్ బియ్యం..
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై అంజనేయులు మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం రావడంతో పిట్లంలోని గురుజాల రాకేష్ అనే కిరాణా వ్యాపారి ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించగా, ఇంటి ముందర ఉన్న బొలెరో వాహనంలో సుమారు 450 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. నిందితుడు ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వేరే ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని తెలిపాడు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని, రాకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.


