నిజామాబాద్ అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 30 ఫిర్యాదులు రాగా, చట్టప్రకారం సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
పండుగ వాతావరణంలో
పంద్రాగస్టు నిర్వహించాలి
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, సజావుగా జరిగేలా అ న్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, విద్యా, వై ద్యం తదితర శాఖల పనితీరు చాటేలా శకటాల ప్రదర్శన, స్టా ల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ కూడా జాతీయ ప తాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అ న్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయన్న, కలెక్టరేట్ ఏవో బాలరాజు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సబ్ స్టేషన్‌ను
పరిశీలించిన సీఈ
నవీపేట: నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామ శివారులో నిర్మించిన నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని చీఫ్ ఇంజినీర్ ఇన్ కన్‌స్ట్రక్షన్ జేఆర్ చౌహాన్ సోమవారం సందర్శించారు. నిర్మాణంతోపాటు సాంకేతిక పరీక్షలు పూర్తయినట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే విద్యుత్ ఉప కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్న ట్లు సీఈ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయ, గృహ అవసరాలకు విద్యుత్ ఉపకేంద్రం దోహదం చేస్తుందన్నారు. అనంతరం చార్జింగ్ పనులను పరిశీలించారు. ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు, అధికారులు శ్రీని వాసరావు, వెంకటరమణ, స్వామి, ప్రశాంత్ రెడ్డి, నటరాజ్, ఏఈలు పాల్గొన్నారు.


