డిచ్‌పల్లి: డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, రైల్వేగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) ఏర్పాటు చేయించాలని ఘన్‌పూర్ ప్రజలు, బీఆర్‌ఎస్‌నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం వారు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్‌రూరల్ ఎ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, ఆర్‌యూబీ ఏర్పాటు చేయించాలని కోరారు. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌కు ఇవతల ఉన్న ఘన్‌పూర్ గ్రామంలోనే రెవెన్యూ, మండల పరిషత్, ఇతర శాఖల కార్యాలయాలు, ప్ర భుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా యన్నారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు రైల్వేస్టేషన్‌లోని పట్టాలు దాటుతూ ఆయా కార్యాలయాలకు చేరుకుంటున్నారన్నారు. పట్టాలు దాటే సమయంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారని, ఈ విషయమై ఎన్నిసార్లు చెప్పినా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. రైల్వే ఉన్నతాధికారు లతో మాట్లాడి, పుట్‌ఓవర్ బ్రిడ్జి, ఆర్‌యూబీ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చింతశ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రంజిత్ కుమార్, పార్టీ నాయకులు గడ్డం గంగాధర్, యేన్నోళ్ల రాజు, రవి కిరణ్, గంగిసాయిలు, గణేష్ రెడ్డి, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


