తానూరు: 2024లో మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి అదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. తానూరు, దౌలతాబాద్ గ్రామాల్లో శనివారం పర్యటించారు. 2024 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న తానూరు గ్రామానికి చెందిన జాదవ్ బాలాజీ, దొంతుల వార్ పోశెట్టి , దౌలత్ బాద్ గ్రామానికి చెందిన రాజుల వెంకన్న వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ సర్పంచ్ వెంకట మాధవరావుతో కలిసిబాధిత కుటుంబాల వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. పంటల దిగుబడి రాక బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడించారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా హృదయంలో రూ.6 లక్షల పరిహారం, కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5 వేలు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


