న్యూస్‌రీల్
ఎవరు పిలిచినా వెళ్లి ఉచితంగా వంటల తయారీ వారి చేయి పడితే ఘుమ ఘుమలే పెళ్లిళ్లు, ఉత్సవాల్లో వారు ఉండాల్సిందే..
నిర్మల్
భూముల రీసర్వే
వేగవంతం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: భూముల రీసర్వే వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. రీసర్వే పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ జిల్లాలో మొదటి దశ కింద ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో సర్వే పనులను పూర్తి చేయాలన్నారు. సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, పనుల వేగవంతానికి అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే సిబ్బందికి తగిన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సరిహద్దు వివాదాలు, భూ రికార్డుల్లో వ్యత్యాసాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూయజమానులకు అవగాహన కల్పిస్తూ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. పరికరాల కొరతతో పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన సాంకేతిక పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవాలని తెలిపారు.
జిల్లాలో వేగంగా రీసర్వే పనులు..
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ భవేశ్‌మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ రీసర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. పనుల వేగాన్ని పెంచేందుకు ఇటీవల అదనపు సర్వే యంత్రాలను కూడా సమకూర్చుకున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ విఠల్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపూర్ గ్రామానికి చెందిన పల్లె విఠల్ జాతర ఉత్సవాలు, పండుగ వేడుకల్లో భక్తులకు శాఖాహార వంటకాలు తయారు చేస్తాడు. భక్తులు విఠల్ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు. కంది పప్పుతో చేసే వంటకాలు ఎంతో రుచిగా చేయడం విఠల్ ప్రత్యేకత. అందుకే ఇతడిని పప్పు విఠల్‌గా పిలుస్తున్నారు.
కుంటాల: వారంతా ఐదు పదుల వయసు దాటినవారే.. వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వృత్తి వ్యవసాయమే అయినా ప్రవృత్తిగా గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, జాతరల్లో ఘుమఘుమలాడే వంటలను ఉచితంగా తయా రు చేస్తున్నారు. ఎవరు పిలిచినా వెళ్లి.. వంటలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులకు శాకాహారం, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో అతిథులకు నోరూరించే వంటకాలు తయారు చేస్తున్నారు.
స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులు
మండలంలోని సూర్యపూర్ గ్రామానికి చెందిన పల్లె విఠల్, కుంటాలకు చెందిన మానాజిగారి పోశెట్టి, అంబకంటికి చెందిన గోవు రాజేశ్వర్, ఓల గ్రామానికి చెందిన సాంగ్వి రాజేశ్వర్ ఉచితంగా వంట చేస్తూ గ్రామస్తులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శుభకార్యాలు నిర్వహించాలంటే వంటల ఖర్చు గురించి నిర్వాహకులు ఆందోళన చెందుతుంటారు. వీరికి మాత్రం హాజరయ్యే అతిథుల సంఖ్య చెబితే చాలు, ఆహార మెనూ సిద్ధం చేసి అందిస్తారు.
భీమా.. మన్నించు
కుమురంభీం ఉద్యమానికి ఊపిరి పోసిన గ్రామాలు అవి.. భీం మరణించి 8 దశాబ్దాలైనా ఆ 12 గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు.
IIలోu


