‘పీఎం రాహత్‌’తో ప్రాణ రక్షణ | - | Sakshi
Sakshi News home page

‘పీఎం రాహత్‌’తో ప్రాణ రక్షణ

Oct 24 2026 11:53 PM | Updated on Oct 24 2026 11:53 PM

● రోడ్డు ప్రమాద బాధితులకు ఆస్పత్రుల్లో రూ.1.50 లక్షల వరకు వైద్యం ● కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సంజయ్‌ జాజు

నిర్మల్‌చైన్‌గేట్‌: రోడ్డు ప్రమాద బాధితులకు సమయానికి మెరుగైన అత్యవసర వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడడంలో ‘పీఎం రాహత్‌’ (ప్రైమ్‌ మినిస్టర్‌ రోడ్‌ ఆక్సిడెంట్‌ విక్టిమ్స్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అస్యూర్డ్‌ ట్రీట్‌మెంట్‌) పథకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సంజయ్‌ జాజు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలి సి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉండే ‘గోల్డె న్‌ అవర్‌’ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కీలకమన్నారు. ఆ సమయంలో అధికారులు, వైద్యసిబ్బంది అత్యంత వేగంగా స్పందించాలని సూచించారు. పోలీస్‌ ఆమోదిత కేసులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గరిష్టంగా రూ.1.50 లక్షల వర కు ఉచితంగా పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందన్నారు. చికిత్స ఖర్చులను జనరల్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా నేరుగా ఆస్పత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు, వివరాల పారదర్శ క నమోదుకు ‘టీఎంఎస్‌ 2.0’ పోర్టల్‌ను, అత్యవసర సేవల కోసం 112, సీసీటీఎన్‌ఎస్‌ వ్యవస్థలను అనుసంధానించాలని ఆదేశించారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలు, జిల్లా ఇన్ఫర్మాటిక్స్‌ అధికారులను భాగస్వామ్యం చేస్తూ పథకం అమలును నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

వైద్యం నిరాకరించొద్దు..

వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసిన అనంతరం కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ‘పీఎం రాహత్‌’ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. బాధితుల వద్ద నగదు లేదా పూర్తి సమాచారం అందుబాటులో లేదనే కారణంతో ఏ ఆస్పత్రిలోనూ వైద్య సేవలు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందగానే అన్ని శాఖలు అప్రమత్తమై, సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్‌ రమేశ్‌, వెంకటమాధవ రావు, రవాణాశాఖ అధికారి దుర్గా ప్రసాద్‌, డీఎంహెచ్‌వో రాజేందర్‌, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement