భైంసా: వర్షాలు ఆలస్యం కావడంతో పత్తి పంట చేతికి రావడం కొంత ఆలస్యమవుతోందని, ప్రస్తుతం పత్తి పంట చేలల్లోనే ఉందని, మరో 15 రోజుల్లో రైతుల ఇళ్లకు చేరే అవకాశం ఉందని భైంసా ఏఎంసీ సెక్రెటరీ పూర్యనాయక్ తెలిపారు. పత్తి కొనుగోళ్లకు అనుగుణంగా మార్కెట్ కమిటీ తరఫున అవసరమైన ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని ‘సాక్షి’కి తెలిపారు.
సాక్షి: మద్దతు ధర లభించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
సెక్రెటరీ: ప్రభుత్వ కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) ప్రకారం అర్హత కలిగిన పత్తిని కొనుగోలు చే సేలా సంబంధిత కొనుగోలు సంస్థలతో సమన్వయం చేస్తాం. పత్తి నాణ్యత, తేమ శాతం, ప్ర భుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరగాలి. రైతులు అధికారిక కొనుగోలు కేంద్రాల వివరాలు తెలుసుకుని, అక్కడి నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించాలి.
సాక్షి: కొనుగోళ్లలో మోసాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
సెక్రెటరీ: రైతులకు న్యాయం జరిగేలా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండటం ముఖ్యం. తూకంలో తేడాలు, ధర చెల్లింపుల్లో జాప్యం, ఇతర అవకతవకలు జరగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. రైతులు తూకం వివరాలను పరిశీలించి, కొనుగోలు రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే మార్కెట్ కమిటీ అధికారులకు తెలియజేయాలి.
సాక్షి: పత్తి విక్రయానికి వచ్చే రైతులు ఎలాంటి పత్రాలు తీసుకురావాలి?
సెక్రెటరీ: రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, సాగుకు సంబంధించిన పత్రాలు, సంబంధిత కొనుగోలు సంస్థ కోరిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి.


