పోలీసులకు ఫిట్‌నెస్‌ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఫిట్‌నెస్‌ ముఖ్యం

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

నిర్మల్‌టౌన్‌/భైంసాటౌన్‌/ఖానాపూర్‌: పోలీస్‌ సిబ్బందికి శారీరక దఢత్వం, క్రమశిక్షణ ముఖ్య మని నిర్మల్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్‌, భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, ఖానాపూర్‌ సీఐ సత్యనారాయణ అన్నారు. నిర్మల్‌ ఎస్‌డీపీవో కార్యాలయంలో, భైంసా, ఖానాపూర్‌ జూనియర్‌ కాలేజీల మైదానంలో వేర్వేరుగా శనివారం పోలీస్‌ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమన్నారు. పోలీస్‌ సిబ్బంది ప్రతిరోజూ వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ అవసరమన్నారు. పరేడ్‌లతో క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలన పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పని చేయవచ్చన్నారు. పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement