వీబీజీ రామ్‌జీ పేదలకు ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రామ్‌జీ పేదలకు ఆర్థిక భరోసా

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

కడెం: ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీబీజీ రామ్‌జీ పథకం గ్రామీణ పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. మండలంలోని కొండుకూర్‌ గ్రామంలో శనివారం నిర్వహించిన జోన్‌–1 స్థాయి కడెం, ఖానాపూర్‌, దస్తురాబాద్‌, పెంబి మండలాల వీబీజీ రామ్‌జీ జీపీ మైక్రో ప్లాన్‌ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఎల్‌నినోతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టే పనులకు కూలీ డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, జలవనరుల అభివృద్ధి వంటి పనులను చేపట్టడం ద్వారా ఉపాధితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రజల వద్దకే వెళ్లి ఉపాధి పనులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, ఇంజినీరింగ్‌ అధికారులు సందీప్‌, తుకారాం, తహసీల్దార్‌ ఖాజా మొయినుద్దీన్‌, ఎంపీడీవో అరుణ, ఏపీవో జయదేవ్‌, ఇతర శాఖల అధికారులు, కడెం, ఖానాపూర్‌, దస్తురాబాద్‌, పెంబి మండలాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement