కడెం: సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరివ్వాలని మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రాను సదర్మాట్ ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని నిర్వహించే సమావేశానికి వెళ్తున్న ఆయన రైతుల వద్ద అగి వారి సమస్యను విన్నారు. పంటలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీలో నీటి లభ్యత, కాలువలకు నీటి విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధర్నాకు సిద్ధమైన రైతులతో ట్రాఫిక్ జాం కాకుండా ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు సాయికిరణ్, హన్మండ్లు ముందస్తు బందోబస్తు నిర్వహించారు. రైతులకు నచ్చజెప్పారు. ఇందులో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ భుక్యా అమ్మిబాపురావు, సర్పంచ్ పంజాల శకుంతలరామాగౌడ్, స్టీఫేన్, రాజేశ్వర్‌గౌడ్, ఆయకట్టు రైతులు ఉన్నారు.
కదిలిన యంత్రాంగం
కడెం: మండలంలోని పాతమద్దిపడగ, కొత్తమద్దిపడగ, లక్ష్మీసాగర్, పెద్దూర్‌తండా తదితర గ్రామాల్లోని సదర్మాట్ చివరి ఆయకట్టు పంటలకు సక్రమంగా నీరందక ఎండిపోతున్నాయి. ఈ విషయమై కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశాల మేరకు తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు శనివారం ఆయా గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. ఇందులో సర్పంచులు జడ లావణ్యక్రిష, శకుంతలరామగౌడ్, మాజీ ఎంపీపీ అమ్మిబాపురావు, రైతులు ఉన్నారు.


