నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. టీఏఏ సెక్రెటరీ, ఒలింపిక్ మెంబర్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన ఈ పరీక్షకు వివిధ పాఠశాలలు, తైక్వాండో అకాడమీలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ నైపుణ్యాలు ప్రదర్శించారు. అర్హత సాధించిన వారికి ఎల్లో, గ్రీన్, బ్లూ, రెడ్ బెల్ట్‌లు ప్రదానం చేశా రు. తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అమ్ముల భూషణ్, ఉపాధ్యక్షుడు అనంతుల ప్రదీప్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి వంశీ, సంయుక్త కార్యదర్శి సెర్ల శ్రీనివాస్, అకోజీ అభిలాష్ పాల్గొన్నారు.
భైంసాటౌన్: పట్టణంలో షోటోకాన్ కరాటే బెల్ట్ అప్‌గ్రేడింగ్ పరీక్షలు జరిగాయి. సుభాష్‌నగర్‌లోని ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చీఫ్ ఎగ్జామినర్ తేజంధర్‌సింగ్ భాటియా హాజరయ్యారు. క్రీడాకారులు గ్రేడింగ్ పరీక్షల్లో సత్తా చాటారు. జూనియర్ రెడ్ విభాగంలో 90, యెల్లో 56, ఆరెంజ్ 30, గ్రీన్ 26, బ్లూ 15, పర్పుల్ విభాగంలో ఒకరు బెల్ట్ సాధించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కౌన్సిలర్ రజిత మహేశ్, కరాటే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ జ్ఞానతేజ, నితిన్‌గౌడ్, శివరాజ్‌గౌడ్, గజేందర్, సోనీతాయి, సాయికృష్ణ, అనన్య పాల్గొన్నారు.


