నిర్మల్‌చైన్‌గేట్: చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికీ స్ఫూర్తిదాయకమని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేశ్ అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం అధికారికంగా నిర్వహించారు. రాథోడ్ రమేశ్, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర, ఆమె పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనతోపాటు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, కార్మిక శాఖ అధికారి రాజలింగు, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ అర్చన, కుల సంఘాల నాయకులు సుంకెట పోశెట్టి, గజ్జారాం, గంగాధర్, మస్కాపురం పోశెట్టి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


