నిర్మల్‌చైన్‌గేట్: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026ను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యాటక రంగంలో డిజి టల్ సాంకేతికత, కత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన కల్పించడం, విద్యార్థుల సజనాత్మకతను వెలికితీయడమే ఈ పోటీల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, జిల్లా టూరిజం నోడల్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానం,పర్యాటకంగా పరిణామాలు తెలుసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


