8లోu
నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ చేపట్టిన ‘సెల్ఫీ విత్ డాటర్’కు అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి తల్లిదండ్రులు తమ కుమార్తెలతో దిగిన సెల్ఫీలను పంపించారు.
ఇల్లు కళకళలాడాలంటే అమ్మాయి ఉండాలి. ఆమె చిరునవ్వులు, ఆటలు, పాటలు, సందడి.. ఆ ఆనందమే వేరు. కానీ కాలం మారుతున్నా ఇప్పటికీ చాలామంది కూతురిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. కొడుకు పుడితే గొప్పగా జరుపుకుంటారు. కూతురు పుడితే భారంలా భావిస్తారు. టెన్షన్ పడతారు. అలాంటి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి, ఆడపిల్లను రక్షించడానికి పుట్టినదే ‘డాటర్స్ డే’. తల్లిలా, చెల్లిలా, నాన్నకు నీడలా, అమ్మకు తోడుగా ఉంటూ ముద్దులొలికే చిట్టితల్లికి ప్రేమను పంచడమే కాదు. ఆడబిడ్డను పుట్టగానే చంపేసే ఈ లోకానికి ఆమె లేని లోకం లేదని చెప్పడమే ఈ రోజు ప్రత్యేకం. ఆడబిడ్డ గొప్పతనాన్ని చాటే ఈ ప్రత్యేక రోజును ఏటా సెప్టెంబర్ నెల నాలుగో ఆదివారం నిర్వహిస్తారు. డాటర్స్ డే సందర్భంగా ఆడబిడ్డ టెన్షన్ కాదని.. టెన్ సన్స్‌తో సమానమని, కంటే కూతుర్నే కనాలి అని నిరూపించిన జిల్లాలోని కొందరు ఆడబిడ్డల విజయగాధలు..
భైంసాటౌన్: ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలుంటేనే.. అయ్యో అంటుంది ఈ సమాజం. వారిని జాలిగా చూస్తుంది. అలాంటిది ఈ ఇంట్లో ముగ్గురూ కూతుళ్లే. అయినా.. ఆ తల్లిదండ్రులు బాధ పడలేదు.. భారమనుకోలేదు. తమ స్థోమతకు మించి చదివించారు. ఇప్పుడే వారే ప్రయోజకులుగా మారి కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నారు. పట్టణానికి చెందిన నేరెల్‌వార్ దేవేందర్–పద్మ దంపతులకు అనన్య, అలేఖ్య, వైష్ణవి సంతానం. దేవేందర్ స్థానికంగా మున్సిపల్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన బిల్ కలెక్టర్‌గా చేస్తుండగా, పద్మ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కూతురు అనన్య ఇంటర్ వరకు పట్టణంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం టీటీసీ పూర్తి చేసి డిగ్రీ చదువుతుండగా, గతేడాది నిర్వహించిన డీఎస్సీలో మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది. ప్రస్తుతం బిద్రెల్లిలో విధులు నిర్వహిస్తోంది. రెండో కూతురు అలేఖ్య బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, చిన్న కూతురు వైష్ణవి బీటెట్ మూడో సంవత్సరం చదువుతోంది. తాను సైతం అక్కలిద్దరి స్ఫూర్తితో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తానని చెబుతోంది.
ఒత్తిడి లేని విద్య..
మామడ మండలం దిమ్మదుర్తి ఉపాధ్యాయురాలు వనజ ఇటీవల విదేశీ విద్యా అధ్యయనం కోసం జపాన్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ గమనించిన అంశాలను ఆమె వివరించారు.


