కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: కార్మికులకు కనీస వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీ యూ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఇంద్రానగర్‌లోని జిల్లా కార్యాలయంలో పి.గంగమణి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్‌ మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.18,500 అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన, ఆశ, అంగన్‌వాడీ, పంచాయతీ, మున్సిపల్‌, ఆర్పీ, స్కావెంజర్‌ కార్మికుల పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లించాలని, బీడీ కార్మికులకు పెన్షన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు అవకాశం ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్‌ 28, 30 తేదీల్లో జరిగే బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కు మద్దతు తెలిపారు. అక్టోబర్‌ 25, 26 తేదీల్లో ‘చలో హైదరాబాద్‌’, డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నాయకులు సుజాత, గంగాధర్‌, లలిత, మల్లేశ్‌, చంద్రకళ, లావణ్య, రాజశేఖర్‌, క్లెమెంట్‌ వెస్లీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement