మహాసభలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహాసభలను విజయవంతం చేయాలి

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

ఖానాపూర్‌: ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని రాయల సుభాష్‌చంద్రబోస్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ (ఏఐకేఎంఎస్‌) నాలుగో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్‌, ని ర్మల్‌ జిల్లాల ప్రధాన కార్యదర్శి ఎల్‌ఆర్‌ ఉపాలి పి లుపునిచ్చారు. ఖానాపూర్‌లోని జగన్నాథరావు చౌరస్తాలో మహాసభల ప్రచార పోస్టర్‌ను శనివారం ఆవి ష్కరించి మాట్లాడారు. గ్రామీణ సంక్షేమ పథకాల పై జరుగుతున్న దాడులు, పేదల అభివృద్ధిని విస్మరించే విధానాలు, నిర్బంధం తదితర అంశాలపై మ హాసభలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలి పారు. మతపరమైన దాడులు, కుల, లైంగిక అసమానతలు, పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. మహాసభలకు 20రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హా జరుకానున్నారని తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్‌, కోశాధికారి కుడుదుల రాజేశ్వర్‌, జిల్లా కమిటీ సభ్యులు మానుక శ్రీనివాస్‌, గూట్ల ప్రసాద్‌, గోని స్వామి, నాయకులు రవి, మొహినొద్దీన్‌, భీమురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement