ఆలయ పనులపై వారానికోసారి సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆలయ పనులపై వారానికోసారి సమీక్ష

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

బాసర: బాసరలో కొనసాగుతున్న మాస్టర్‌ప్లాన్‌ ప నుల పురోగతిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పనులు వేగంగా పూర్తిచేసే లక్ష్యంతో వారానికోసారి సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఆలయ ఈవో కార్యాలయంలో సీఎం సలహాదారు, ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసుల రాజు సంబంధిత అధికారులతో సమావేశమై మాస్టర్‌ప్లాన్‌ పనులపై సమగ్రంగా సమీక్షించారు. చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు సాధించిన పురోగతి, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ పనులకు సంబంధించిన వివరాలు సేకరించి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతీ అంశంపై ఎప్పటికప్పు డు పర్యవేక్షణ కొనసాగించాలని, పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. గత వారం కూ డా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి పనుల పురో గతిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పనులు పూర్తయ్యేవరకు ఎదురయ్యే సమస్యల ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమీక్షకు ముందు రెవిన్‌ గెస్ట్‌హౌస్‌ను సందర్శించిన సీఎం సలహాదారు అనంతరం బాసర ఈవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. మా స్టర్‌ప్లాన్‌ పనులను త్వరగా పూర్తిచేసే దిశగా అధికా ర యంత్రాంగంపై ఉన్నతస్థాయి నుంచి పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో బాసర తహసీల్దార్‌ పవన్‌చంద్ర, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఆలయ ఈవో అంజనాదేవి, వివిధ శాఖల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement