నిర్మల్‌టౌన్/ఖానాపూర్: మున్నూరు కాపుల వాస్త వ జనాభా వివరాలను ప్రభుత్వానికి తెలుపాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రా ష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ కోరారు. అధి కారిక గణాంకాల్లో మున్నూరు కాపుల జనాభా త క్కువగా నమోదవుతోందని, వాస్తవ జనాభా కోటికి పైగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబం తమ సభ్యుల వివరాలను నమోదు చేసుకునేందు కు రూపొందించిన వెబ్‌సైట్‌ను శనివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో, ఖానాపూర్‌లోని తిమ్మాపూర్ మున్నూరుకాపు సంఘ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. పుట్టిన శిశువు నుంచి వయోవృద్ధుల వరకు కుటుంబ సభ్యుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో మున్నూరుకాపు సంఘ భవనాల నిర్మాణానికి రెండెకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఐక్యత, హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకుసాగాలని పిలు పునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, గండి రామన్న దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఆకుల హరీశ్, నాయకులు బీసీ రాజన్న, దయానంద్, రమేశ్, నర్సయ్య, సంతోష్, వెంకటరాములు, చిన్నయ్య, బీసీ రమేశ్, రాజశేఖర్, శ్రీనివాస్, గజేందర్, శంకర్, మధు, రాజేందర్, రాజన్న తదితరులున్నారు.


