దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ ప్లేర్ ఉన్న త పాఠశాలలో శనివారం 70వ ఎస్‌జీఎఫ్ జూడో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు పా ఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రతిభ కనబరి చి పతకాలు సాధించారు. వీరు జోనల్ స్థాయిలో ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారని జూడో అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను డీఈవో భోజన్న, ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, ప్లేర్ కరస్పాండెంట్ వెంకటనరసింహారెడ్డి, జూడో అసో సియేషన్ ఉపాధ్యక్షుడు సాయికిరణ్, కార్యదర్శి శివప్రసాద్ వివిధ స్కూళ్ల పీఈటీలు అభినందించారు. జోనల్ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు.


