పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

నిర్మల్‌ రూరల్‌: స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ ఏర్పడి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధికసంఖ్య లో హాజరు కావాలని సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో కార్యక్ర మ ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణలో ఎస్టీ యూ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉ పాధ్యాయులు వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఖలీద్‌ హైమత్‌, శివలింగయ్య, ఇంతియా జ్‌, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

సందడి చేసిన ఎర్రకాళ్ల కొంగలు

ఖానాపూర్‌: మండలంలోని భాదనకుర్తి గ్రామ గోదావరి తీరంలోని పంట పొలాల్లో పెయింటెడ్‌ స్టార్క్‌ (ఎర్రకాళ్ల కొంగ)లు సందడి చేస్తున్నాయి. తెల్లటి శరీరంపై నల్లటి చారలు, రెక్క ల చివర గులాబీ ఛాయలున్న ఈకలు, పొడవై న పసుపు–నారింజ రంగు వంగిన ముక్కు, ఎ రుపు–గులాబీ రంగు పొడవైన కాళ్లు వీటి ప్ర త్యేకత. వీటి శాసీ్త్రయ నామం మైక్టీరియా ల్యూ కోసెఫాలా. కొంగల జాతికి చెందిన ఈ పక్షులు చెరువులు, నదులు, తడి నేలలు, నీరు నిలిచిన పొలాల్లో ఆహారం కోసం సంచరిస్తాయి. చిన్న చేపలు, కప్పలు, శంఖువులు, కీటకాలు, ఇతర చి న్న జలచరాలను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతకు దోహదపడతా యి. వీటిని చూసిన రైతులు, గ్రామస్తులు, పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement