కొరడి గణపతికి ఎస్పీ పూజలు | - | Sakshi
Sakshi News home page

కొరడి గణపతికి ఎస్పీ పూజలు

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

భైంసారూరల్‌: భైంసా మండలంలోని మాటేగాం గ్రామంలోని స్వయంభూ కొరడి గణపతిని శుక్రవారం ఎస్పీ జానకీ షర్మిల దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ విశిష్టతను నిర్వాహకులు ఎస్పీకి వివరించారు. రోజుకు సుమారు 30వేల మంది భక్తులు గణపతిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, సీఐ ప్రవీణ్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

లోకేశ్వరం: మండలంలోని అబ్ధుల్లాపూర్‌ గ్రామంలోని మోక్ష (కర్ర) గణపతిని ఎస్పీ జానకీ షర్మిల దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీని గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, సీఐ రవీందర్‌ నాయక్‌, మల్లేశ్‌, ప్రవీణ్‌, ఎస్సైలు సుప్రియ, ప్రదీప్‌, తహసీల్దార్‌ సూర్యరావ్‌, సర్పంచ్‌ దడిగే జయలలిత, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement