కుంటాల: మండల కేంద్రంలోని శాంతినికేత న్ పాఠశాలలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, సీనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు శుక్రవా రం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ జక్కుల గజేందర్, తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీవో శోభన, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సునీల్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కన్వీన ర్ శ్రీధర్‌రెడ్డి, పెటా జిల్లా అధ్యక్షుడు అంబా జీ, టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్, జాతీయ రెఫరీ ప్రేమలత, ఆర్గనైజర్ శ్రీనివా స్, కార్యదర్శి రాజబాపు తదితరులున్నారు.


