రీజియన్ వారీగా ఉద్యోగులు
మంచిర్యాలఅర్బన్/ఆదిలాబాద్: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర కార్మిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 21న పోటీలో పాల్గొనే సంఘాల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తారు. 22న సంబంధిత డిపో మేనేజర్లు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీన ప్రధాన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
చివరిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే..
ఆర్టీసీ సంస్థలో 2016లో గుర్తింపు కార్మిక సంఘం ఎ న్నికలు జరిగాయి. గుర్తింపు యూనియన్‌గా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఏఐటీయూసీ అనుబంధ సంఘం గెలుపొందింది. తర్వాత సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2019లో 53రోజుల సమ్మె జరిగింది. జేఏసీగా ఏర్ప డి ఉద్యమాన్ని కొనసాగించారు. అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘ ప్రాతినిధ్య సంఘాల సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించకుండా వెల్ఫేర్ కమిటీలను నియమించింది. కమిటీ ఆధ్వర్యంలోనే సమస్యలపై చర్చలు సాగినా కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. 2026 ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంలో జరిగిన చర్చల్లో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేయటం.. ఎన్నికల నిర్వహణ, తదితర సమస్యలపై సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
డిపో ఉద్యోగుల సంఖ్య
ఆదిలాబాద్ 406
ఆసిఫాబాద్ 264
భైంసా 208
మంచిర్యాల 420
నిర్మల్ 410
ఉట్నూర్ 118
ఆర్‌ఎంఎస్ ఆఫీస్ 44
మొత్తం 1,870
ఎన్నికలు ఇలా..
ఆర్టీసీలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిచిన సంఘాన్నే అధికారిక గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. రీజియన్ స్థా యి, రాష్ట్రస్థాయిలో గుర్తింపు సంఘాలుగా ఉంటాయి. రెండింటికీ వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. కార్మికుల వేతనాలు, బోనస్, డీఏల నుంచి మొదలుకొ ని సమస్యలపై చర్చలు జరిపే చట్టబద్ధమైన హక్కు ఈ సంఘానికే ఉంటుంది. ఎన్నికల్లో గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యపై యా జమాన్యంతో సంప్రదింపులు జరుపుతాయి. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికుల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా యి. సంస్థలో పనిచేసే అధికారి స్థాయి వారు మినహా, మిగిలిన ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అందరికీ ఓటు హక్కు ఉటుంది.


