శాసనసభలో జిల్లా వాణి | - | Sakshi
Sakshi News home page

శాసనసభలో జిల్లా వాణి

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

● సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యేలు ● నిధులు విడుదల చేయాలని డిమాండ్‌

రైతాంగాన్ని ఆదుకోవాలి: రామారావుపటేల్‌

భైంసా: వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గ రైతులను ఆదుకోవాలని ము ధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ కోరారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకు భరోసా కల్పించా లని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలుగన్న 28 ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు తక్షణమే రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం నియోజకవర్గ రైతులు విలువైన భూ ములు కోల్పోయారని తెలిపారు. ఇప్పుడు సాగునీటి కోసం వారు ఇబ్బందులు పడటం బాధాకరమని పేర్కొన్నారు. పిప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు ఇప్పటికే సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ సరఫరా కోసం మరో రూ.2.20 కోట్లు అవసరమని పేర్కొన్నారు. నిధులు విడుదల చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తే సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు.

గిరిజన హక్కులపై రాజీ లేదు: వెడ్మ బొజ్జు పటేల్‌

ఖానాపూర్‌: గిరిజన ప్రాంతాల ప్రజల హక్కులు, ప్రత్యేక అవకాశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ శాసనసభలో కోరారు. జీవో 3తోపా టు షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించిన ఇతర నిబంధనలు, సుమారు 29 జీవోలు రద్దు కావడంతో గిరిజనుల ఉద్యోగ, విద్యావకాశాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల స్థానిక గిరిజన యువతకు పోలీస్‌ నియామకాల్లో 75శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 75శాతం ప్రత్యేక ని బంధన ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ లోనూ ఇలాంటి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. గిరిజన ప్రాంతాల్లో ఫారెస్ట్‌, రెవెన్యూ సమస్యలు, విద్యుత్‌ స్తంభాల మార్పిడి, పారిశుద్ధ్యం, రెవె న్యూ సర్టిఫికెట్ల జారీ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గిరిజనులకు మౌలి క వసతులు, హక్కులు, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలనియ విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామారావు పటేల్‌

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement