రుచికరమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రుచికరమైన భోజనం అందించాలి

Sep 9 2026 11:22 PM | Updated on Sep 9 2026 11:22 PM

లక్ష్మణచాంద: విద్యార్థినులకు రుచికరమైన భోజ నం అందించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సరిత, ప్రేమలత అగర్వాల్‌ ఆదేశించారు. బుధవారం లక్ష్మణచాంద కేజీబీవీని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వంట గదిలో ని సరుకులు, కూరగాయలు పరిశీలించారు. వంట లు రుచి చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థినుల జూడో, కరాటే ప్రతిభను గుర్తించి అభినందించారు. విద్యార్థినులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థినులకు మాక్‌ అసెంబ్లీని నిర్వహించాలని, జీకే, వివిధ సమకాలిన అంశాలపై బోధించాలని సూచించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థినులతో మాట్లాడా రు. వసతుల గురించి ఎస్వో నవితను అడిగి తెలు సుకున్నారు. వారి వెంట డీఈవో భోజన్న, ఐసీడీఎ స్‌ సీడీపీవో సరిత, సూపర్‌వైజర్‌ ప్రసూన కుమారి, ఎంఈవో రాజునాయక్‌ తదితరులున్నారు.

సోన్‌ మండ లం లెఫ్ట్‌ పోచంపాడ్‌లో..

సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపాడ్‌ బాలికల గురుకుల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర బాలల హ క్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సరిత, ప్రేమలత తనిఖీ చేశారు. వంటశాల పరిశీలించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement