నిర్మల్‌చైన్‌గేట్: ఎస్‌ఐఆర్‌ను గడువులోపు పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం పట్ట ణంలోని అంబేడ్కర్ భవన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. బీఎ ల్వోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అ ర్హుల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొ లగించేలా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాల ని సూచించారు. 18 ఏళ్లు నిండినవారంతా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ దనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీ వో దేవిదాస్, తహసీల్దార్ రాజు తదితరులున్నారు.


