న్యూస్‌రీల్
నృత్య ప్రదర్శనలో ప్రతిభ
నిర్మల్‌ఖిల్లా: సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో జిల్లా బాలనృత్యకారిణి ప్రతిభకనబర్చింది. స్వర్ణ బాలాజీ పురస్కారాన్ని అందుకుంది. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన పసులోటి ప్రియాంక–శ్రీకాంత్ దంపతుల కుమార్తె వంశిక యాదాద్రిభువనగిరి జిల్లాలోని స్వర్ణగిరిలో ఆదివారం నిర్వహించిన నృత్య ప్రదర్శనలో స్వరూపిణి కళాక్షేత్రం బృందంతో కలిసి పాల్గొంది.వంశిక భక్తి భావాన్ని పెంపొందించే విధంగా చేసిన నృత్య ప్రదర్శన అక్కడి ఆకట్టుకుంది. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు వంశికకు స్వర్ణ బాలాజీ పురస్కారంతోపాటు, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.


