లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తునర్న ఎస్జీటీ పోతుగంటి గంగాధర్ 2024 జూలై 1న బదిలీపై ఇక్కడికి వచ్చారు. రెండేళ్లలో పాఠశాలపై తనముద్ర వేసుకున్నారు. గతేడాది వేసవిలో సెలవుల సమయంలో బడిబాటతో సంబంధం లేకుండా తల్లిదండ్రులను కలిసి ఉపాధ్యాయులందరి సహకారంతో ఇంటింటికీ తిరిగి 97 మంది విద్యార్థుల సంఖ్యను 135కి పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గ్రామస్తులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనంలో తాత్కాలికంగా రేకులతో గదులు ఏర్పాటు చేయించారు. పరిసరాలలో లభించే లోకాస్టు నోకాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగిస్తూ పిల్ల లకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడంతో ఆయన దిట్ట. ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన చేస్తూ చదువులో ముందుకు వెళ్లేగా కృషి చేస్తున్నాడు. పాఠశాలకు సరిగా హాజరు కాని పిల్ల ల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్ల లను తన సొంత బండిపై పాఠశాలకు తీసుకువస్తూ గ్రామస్తుల మన్ననలు పొందారు.


