నిర్మల్ రూరల్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరి గిందని వివిధ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్టీయూటీఎస్, యూటీఎఫ్, టీఆర్టీయూ, టీయూటీఎఫ్, డీటీఎఫ్ నా యకులు జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవన్‌లో శుక్రవారం మాట్లాడారు. పదేళ్లకన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వాల్సి ఉండగా, రెండు, మూడేళ్ల సర్వీస్ ఉన్నవారిని ఎంపిక చేశారని తెలిపారు. ఎంపికలో కొన్ని మండలాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న తదితరులు పాల్గొన్నారు.


