ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థి అయిన ఎన్‌ఆర్‌ఐ చేయూతని చ్చాడు. సుర్జాపూర్ గ్రామానికే చెందిన రేండ్ల కిషన్ కుమారుడు రేండ్ల రాజేందర్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను చదివిన పాఠశాలకు సుమారు రూ.50 వేల విలువైన రెండు బీరువాలు, ఏడు స్టడీ చైర్లు, ఇతర విద్యాసామగ్రిని సమకూర్చాడు. మంగళవారం ఫర్నీచర్‌ను పాఠశాల యాజమాన్యానికి రాజేందర్ తండ్రి కిషన్ అందజేశారు. సర్పంచ్ బక్కశెట్టి వెంకట్‌రాములు, హెచ్‌ఎం వడ్నూరి మునీందర్, ఉపసర్పంచ్ కడమంచి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి విక్రం రాజ్, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు తునికి మహేందర్, హరీశ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


