సీపీఎస్‌ రద్దు చేయాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాలని నిరసన

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

భైంసాటౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు భైంసా చైర్మన్‌ ఎన్‌.శ్రీహరి ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగనాథ్‌, కార్యదర్శి భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌, కార్యవర్గ సభ్యులు సుజిత్‌రెడ్డి, పల్లవి తదితరులున్నారు.

ఖానాపూర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం ఖానాపూర్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈనెల 10న హైదరాబాద్‌లో భారీ మహాధర్నా, చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నాయకులు జుట్టు గజేందర్‌ యాదవ్‌, వెంకటరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్‌ నాయక్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్‌, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, టీఎన్‌జీవో, సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కుంటాల: మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement