రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: హైదరబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, నాయకులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా నాయకులు పేర్కొన్నారు. వారి అరెస్టును నిరసిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు రావుల రాంనాథ్‌, మెడిశెమ్మ రాజు, సాదం అరవింద్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు గంజి రాజు, కూన శశాంక్‌, సాత్విక్‌, ఈశ్వర్‌, వెంకటేష్‌, ఉదయ్‌, సాయిరెడ్డి, విజయ్‌, రాజు భరత్‌, హరీశ్‌ ఉన్నారు.

‘దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’

కడెం: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement