‘పది’ పరీక్షలకు ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

తానూరు: పాఠాలను బట్టి పట్టకుండా.. అర్థం చేసుకుంటూ చదువుతూ ఇప్పటినుంచే ప్రణాళికతో వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పదో తరగతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం తానూరు కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాల్‌ అలేఖ్యను అడిగి తెలుసుకున్నారు. పొలాల నుంచి పాఠశాల ఆవరణలోకి వరద వస్తుందని చెప్పగా మొరం వేయించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పాఠ్యాంశాల ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. హాజరు వందశాతం నమోదయ్యేలా చూసి.. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. మెనూ ప్రకారం నా ణ్య మైన అల్పాహారం, భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఈవో భోజన్న, ఎంఈవో నరేందర్‌, ఎంపీడీవో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement