టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో అండర్‌–17 బాలబాలికల జిల్లాస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్‌ దొనికేని లక్ష్మీదయానంద్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీ కరించే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకో వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు పట్టుదలతో సాధన చేస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించవచ్చన్నా రు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 65 మంది క్రీడాకా రులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జాడి శ్రీనివాస్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ ఆర్‌.లక్ష్మణ్‌, టీజీ పెటా అధ్యక్షుడు ఎన్‌.సత్తయ్య, కార్యదర్శి వి.భూమన్న, వ్యా యామ ఉపాధ్యాయులు షేక్‌ ఇమ్రాన్‌, రమణారావు, నవీన్‌, రామారావు, వెంకటరమణ, రాముగౌడ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement