అంగన్‌వాడీ కేంద్రాలు ఆహ్లాదకరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలు ఆహ్లాదకరంగా ఉండాలి

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌ రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాలు ఆహ్లాదంగా ఉండాలని, చిన్నారులు కేంద్రాలకు వచ్చేలా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ మండలం రత్నాపూర్‌కాండ్లీ అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. గ్రామాల్లోని చిన్నారులందరి నీ కేంద్రాల్లో చేర్పించేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలకు పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు, పెయింటింగ్స్‌, వర్ణమాల, విద్యా చార్టులు వే యించాలన్నారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటలు, రైమ్స్‌ నేర్పించాలని తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, బరువు త దితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమో దు చేయాలని ఆదేశించారు. సామ్‌, మామ్‌ కేటగిరీ కి చెందిన పిల్లల వివరాలు పకడ్బందీగా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు అదన పు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.రైమ్స్‌ చెప్పించి, సంఖ్యలు చదివించి చాక్లెట్లు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారులు పవన్‌కుమార్‌, సౌమ్య, నయనారెడ్డి, రమేశ్‌, అలీ, సర్పంచ్‌ హరీశ్‌, ఉప సర్పంచ్‌ భూమేష్‌, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీవో..

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌లోని రాంనగర్‌ స్థానిక గిరిజ న బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా గిరిజ న సంక్షేమ అధికారి చౌహాన్‌ నిహారిక గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వచ్చిన ఆమె, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజన నాణ్యతను, రుచిని పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాన్ని పరిశీలించి, మెనూ ప్రకారమే విద్యార్థులకు రోజూ భోజనం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకూడదని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలోని పలు రికార్డులను, విద్యార్థుల హాజరు రిజిస్ట ర్‌ పరిశీలించారు. విద్యార్థుల చదువు, వసతి గృహ నిర్వహణపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement