ఆదిలాబాద్‌టౌన్/సాత్నాల: మహారాష్ట్ర నుంచి ద్వి చక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఆర్.విజేందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు బుఽ దవారం భోరజ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పిప్పర్‌వాడకు చెందిన శరన్ శైలేంద్రరెడ్డి, ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన గౌరు సాయికృష్ణ, సాంగ్వికి చెందిన శంకర్ వద్ద రూ.10,300 విలువైన 161 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


