భైంసా: ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగా హన కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో భైంసా ఖేలో ఇండియా సెంటర్‌లో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనుమతితో కార్యక్రమాన్ని నిర్వహించగా యువత, విద్యార్థులు, క్రీడాకారులు, సైక్లింగ్, వాకింగ్ ప్రియులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైక్లింగ్, వాకథాన్‌తో పాటు పలు క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.


