నిర్మల్‌చైన్‌గేట్: సెన్సస్ హ్యాండ్ బుక్ మ్యానువల్ స మాచారం మొత్తాన్ని ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నుంచి ఆయన సంబంధిత అధికారులతో సె న్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై శనివారం సమీక్ష నిర్వహించారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇప్పటి వరకు సేకరించిన నిర్దేశిత సమాచా రం, ఇంకా సేకరించాల్సిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన సమాచారం మొత్తం నిర్దేశిత ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సేకరించే, ఆన్‌లైన్ చేసే సమాచారం తప్పులు లేకుండా ఉండాలని తెలిపారు. వీసీలో కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ), కిశోర్‌కుమార్, సీపీవో గంగారెడ్డి పాల్గొన్నారు.


