నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆ ధ్వర్యంలో చేపట్టిన ఫీజు బకాయి బీజేపీ లడా యి కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం నా యకులు స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదు ట నిరసన దీక్ష చేపట్టారు. ఫీజుల బకాయిలు ఇస్తావా? రాజీనామా చేస్తావా? అంటూ నినా దాలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడం లేదన్నారు. సుమారు రూ.15 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మె రాజు, సత్యం చంద్రకాంత్, జమాల్, దినేశ్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.


