బాసర: ఆర్జీయూకేటీ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణతో పాటు మానసిక ధృఢత్వం పెంపొందించుకోవాలని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్జీయూకేటీ సైకాలజికల్ వెల్‌నెస్ సెంటర్, జిల్లా డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీయూసీ1 బ్యాచ్2 విద్యార్థులకు శనివారం ఎస్‌ఏసీలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కులు సాధించడం కాదని, శారీరక, మానసిక, నైతిక వికాసంతో కూడిన సమగ్ర అభివృద్ధి అన్నారు. పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ మాట్లాడుతూ వెల్‌నెస్ సెంటర్ సేవలను విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీన్ ఎస్.విట్టల్, తదితరులు పాల్గొన్నారు.


