ముధోల్: శ్రీశిశుమందిర్ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి గణిత విజ్ఞాన సాంస్కృతి మేళా ముధోల్‌లో మూడు రోజులు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి వేణుమాధవ్ తెలిపారు. ఆగస్టు 30, 31, సెప్టెంబరు 1వ తేదీల్లో జరిగే ఈ మేళాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ మేళాను ప్రారంభిస్తారని తెలి పారు. సెప్టెంబర్ 1న వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆహిలా దినేష్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్ర మం నిర్వహిస్తారని వెల్లడించారు.


