అత్యపత్య పోరు.. హుషారు! | - | Sakshi
Sakshi News home page

అత్యపత్య పోరు.. హుషారు!

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

నిర్మల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు

22 జిల్లాల నుంచి 600 మంది హాజరు

హోరాహోరీగా తలపడిన ఆటగాళ్లు

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో శనివారం రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌డ్డి, న్యూరో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మనోజ్‌భరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రీడాకారులు సత్తా చాటి జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అత్యపత్య అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వన్నెల భూమన్న నేతృత్వంలో జరుగుతున్న ఈ పోటీల్లో 22 జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 600 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు హాజరయ్యారు. వారికి జిల్లా కేంద్రంలోని కస్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. మొదటి రోజు బాలికల విభాగంలో నిర్మల్‌–మెదక్‌ జట్లు తలపడగా నిర్మల్‌ జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో నిజామాబాద్‌–సిద్దిపేట్‌ జట్లు తలపడగా నిజామాబాద్‌ జట్టు గెలిచింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్‌, సాఫ్ట్‌బాల్‌ ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్‌, శ్రీనివాస్‌, గంగాధర్‌, సురేష్‌, భూమేష్‌ , కోచ్‌ సాయిరాజు, ముఖేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement