కుభీర్: మండలంలోని కుభీర్, పార్డి(బి) స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం సెలవుల్లో ఉన్నారు. సెలవు రోజు కాకపోవడంతో విద్యార్థులు బడికి హాజరయ్యారు. దొడర్న, శంఖర్ తండాలో విద్యార్థులు పాఠశాలలో ఉండగా, మధ్యాహ్న భోజన నిర్వాహకులు వండి పెట్టారు. అయితే చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. దావుజీనాయక్ తండాలో ఉపాధ్యాయుడు పాఠశాలకు రాగా, విద్యార్థులు రాలేదు. దార్‌కుభీర్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు సెలవులో ఉండటంతో 11 గంటల వరకు ఎవరూ లేరు. ఆ తర్వాత కుభీర్ ఉన్నత పాఠశాలలో పనిచేసే సీఆర్‌పీ వచ్చారు. పార్డి(బి) కాంప్లెక్స్ పరిధిలోని బ్రహ్మేశ్వర్ పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవులో ఉండగా, ప్రైవేటు ఉపాధ్యాయుడు పాఠాలు బోధించాడు. గాలిసింగ్ తండాలో ఉపాధ్యాయుడు సెలవులో ఉండగా, కాంప్లెక్స్ హెచ్‌ఎం నారాయణ్‌రెడ్డి మధ్యాహ్నం వరకు బడి నడిపి, తర్వాత తాళం వేసి వెళ్లిపోయాడు. సేవాదాస్‌నగర్‌లో ఉపాధ్యాయురాలు సెలవులో ఉండగా, సీఆర్‌పీ రాజు వచ్చి పాఠశాల నడిపారు. మార్లగొండ తండ పాఠశాలలో ఉపాధ్యాయురాలు సెలవు పెట్టగా, పార్డి(బి) ప్రైమరీ స్కూల్ నుంచి ఒకరిని పంపించారు. కుభీర్ కాంప్లెక్స్ పరిధిలో నలుగురు, పార్డి(బి) కాంప్లెక్స్ పరిధిలో ఏడుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టారు. ఈ విషయమై కుభీర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గంగాధర్, పార్డి(బి) హెచ్‌ఎం నారాయణ్‌రెడ్డిని ప్రశ్నించగా, సెలవు కాదనడానికి లేదని తెలిపారు.
శంకర్ తండా పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు.. టీచర్ లేరు
దొడర్నా పాఠశాలలో టీచర్‌లేక
ఖాళీగా ఉన్న విద్యార్థులు
ఉపాధ్యాయుడు రాక గాలిసింగ్ తండా పాఠశాల ఇలా తాళం వేసి ఉంది


