క్రీడలతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆరోగ్యం

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

నిర్మల్‌టౌన్‌: క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావా లని జిల్లా యువజన, క్రీడల అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి, హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాకాల రాంచందర్‌ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్స వం పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహించారు. ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత హాకీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ రాథోడ్‌ లక్ష్మణ్‌, పీడీలు రమణారావు, రవీందర్‌గౌడ్‌, అన్నపూర్ణ, భూమన్న, సత్తయ్య, బుచ్చి రామారావు, సుధార్‌సింగ్‌, పోశెట్టి, వంశీ, కె.శ్రీనివాస్‌, పీఈటీలు సంజీవ్‌, గంగాధర్‌, ముకేశ్‌, భీమేశ్‌, గిరి పాల్గొన్నారు.

బాసర ట్రిపుల్‌ ఐటీలో..

బాసర: బాసర ఆర్జీయూకేటీలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగి న కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం శాతవాహన గ్రౌండ్‌ నుంచి ఔట్‌పోస్ట్‌ వరకు నిర్వహించిన 2కే రన్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్పోర్ట్స్‌ కోటా విద్యార్థులు, క్రీడా విజేతలతో వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ సమావేశమై అభినందించారు. అనంతరం వీసీ ఎలెవన్‌, ఏవో ఎలెవన్‌ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌తో స్టాఫ్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల బాస్కెట్‌బాల్‌ స్నేహపూర్వక మ్యాచ్‌ నిర్వహించారు. ఎస్‌ఏసీలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్సింగ్‌ రూమ్‌ ను వీసీ ప్రారంభించారు. టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌ పోటీలు సైతం ఉత్సాహంగా సాగాయి. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఇ.మురళీ దర్శన్‌ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం అందిస్తాయన్నారు. స్పోర్ట్స్‌ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్‌ రామకృష్ణ, ఫిజికల్‌ డైరెక్టర్లు శ్యామ్‌బాబు, రవికిరణ్‌, పీఈటీలు వసంత, స్వప్న, అసోసియేట్‌ డీన్లు డాక్టర్‌ విఠల్‌, శేఖర్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

ధ్యాన్‌చంద్‌ ఫొటోకు పూలమాలవేసి

నివాళులర్పిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, రాంచందర్‌

కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ఓఎస్డీ మురళీదర్శన్‌ అధికారులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement