ఉమ్మడి జిల్లాలో రూ.2.12 కోట్ల ఆదాయం
భైంసాటౌన్: రాఖీ పండుగతో ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో డిపోలకు భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని బస్టాండ్లన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. రాఖీ పండుగ కావడంతో మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు సొంతూళ్లకు వెళ్లి, తిరుగు ప్రయాణాలతో రద్దీ కనిపించింది. దాదాపు అన్ని డిపోలు 125 శాతానికి మించి ఆదాయం లక్ష్యం దాటాయి. రీజియన్ పరిధిలో రాఖీ పండుగ ఒక్కరోజే రూ.2.12 కోట్ల ఆదాయం చేకూరింది. సాధారణ రోజుల్లో 2.65 లక్షల కి.మీ. మేర సర్వీసులు నడుపుతుండగా, రాఖీ సందర్భంగా 2.78 లక్షల కి.మీ. మేర సర్వీసులు నడిపారు. పండుగ వేళ సాధారణ సర్వీసులతోపాటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్పెషల్ సర్వీసులు నడిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బంది తప్పలేదు. బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో నిండిపోవడంతో పురుషులు, పిల్లలు, వృద్ధులు సీట్లు లేక ఇబ్బంది పడ్డారు. టార్గెట్ పరంగా చూస్తే.. భైంసా డిపోలో లక్ష్యానికంటే తక్కువగా 28,806 కి.మీ మేర సర్వీసులు నడిచినా.. ఆదాయంలో 127.32 శాతం సాధించింది. అలాగే ఆదాయం, ఏపీకే, ఓఆర్ పరంగా ఆదిలాబాద్ డిపో వెనుకబడింది. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) శాతం కూడా 125 శాతానికి మించి నమోదైంది.
డిపోలవారీగా ఆదాయం ఇలా..


