క్రీడల్లో చురకలు | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో చురకలు

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

కబడ్డీ కబడ్డీ..

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రాథోడ్‌ అశిష్‌ మండల, జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్కడ అత్యుత్తమ ప్రదర్శనతో అండర్‌ – 17 విభాగంలో జాతీయస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయ పోటీల్లోనూ బంగారు పతకం సాధించాడు.

అత్యపత్యాలో చరణ్‌..

గతేడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–17 అత్యపత్య పోటీలలో ఓస చరణ్‌ సత్తా చాటాడు. అత్యుత్తమ ప్రదర్శనతో గోల్డ్‌ మెడల్‌ సాధించా డు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధిస్తానని ధీమాతో ఉన్నాడు.

కీర్తన ఖోఖో..

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–14 ఖోఖో పోటీల్లో పాఠశాలకు చెందిన కీర్తన సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయిలో ఆడి సిల్వ ర్‌ మెడల్‌ సాధించింది. జాతీయ జట్టులో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

బేస్‌ బాల్‌లో కరణ్‌ ..

లక్ష్మణచాంద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రాథోడ్‌ కరణ్‌ బేస్‌బాల్‌లో రాణిస్తున్నాడు. అండర్‌–14 రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సత్తా చాటాడు. రాష్ట్ర స్థాయిలో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

లక్ష్మణచాంద: ఒక వైపు చదువులో రాణిస్తూనే మరోవైపు ఆటలు ఆడుతూ రాష్ట్ర, జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు. మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నారు. ప్రధానంగా బేస్‌ బాల్‌, కబడ్డీ, ఆత్యపత్య, ఖోఖో క్రీడల్లో రాణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement